నూతన సర్పంచులను అభినందించిన మానాల మోహన్ రెడ్డి
NZB: కమ్మర్ పల్లి మండలంలో స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. కోనాపూర్ సర్పంచ్ అరుణ్ రెడ్డి, కేసీ తాండా సర్పంచ్ సంతోష్ నాయక్‌లకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.