'గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలి'
VZM: గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టిసారించాలని విజయనగరం ఇంఛార్జ్ డీఎస్పీ ఆర్ గోవిందరావు చెప్పారు. నెల్లిమర్ల పోలీసు స్టేషన్‌ని సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్టేషన్‌లో ఉన్న, ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను డిస్పోజల్ చేయాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పురోగతిని పరిశీలించారు.