జగిత్యాలలో శతాధిక వృద్ధుడు మృతి
JGL: జగిత్యాల పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన కొండ్రా బాపూరావు (102) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. 102 సంవత్సర వయసుగల బాపూరావు గతంలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేసి 1982లో పదవి విరమణ పొందారు. అప్పటినుంచి ఆరోగ్యంగానే ఉన్నప్పటికి ఇటీవల కొంత అనారోగ్యానికి గురయ్యారు. చివరకు 102 ఏళ్ల వయసులో మంగళవారం తుది శ్వాస విడిచారు.