వెన్నునొప్పితో బీటెక్ విద్యార్థి మృతి

వెన్నునొప్పితో బీటెక్ విద్యార్థి మృతి

SDPT: వెన్నునొప్పితో బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కడతల యాదవ రెడ్డి కుమారుడు భాను ప్రసాద్(22) రెండు సంవత్సరాల క్రితం జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా వెన్నునొప్పితో జీవితం మీద విరక్తి చెంది, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.