బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్దం

బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్దం

VKB: డ్వాక్రా మహిళలకు పంపిణీ చేయాల్సిన బతుకమ్మ చీరలను సోమవారం తాండూర్ మండల పరిషత్ కార్యాలయానికి తరలించారు. 33 గ్రామపంచాయతీలోని 25 వేల మంది మహిళలు, యువతులకు అందించేందుకు అవసరమైన చీరలను సిద్ధంగా ఉంచారు. ఈనెల 19న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.