బాల్కొండలో అయ్యప్ప స్వామికి పుష్పాభిషేకం

బాల్కొండలో అయ్యప్ప స్వామికి పుష్పాభిషేకం

NZB: బాల్కొండ మండల కేంద్రంలో మణికంఠ సన్నిధానంలో బుధవారం అయ్యప్ప స్వామి విగ్రహానికి అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో పుష్పాభిషేకం నిర్వహించారు. మాలాధారణ ధరించిన స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. స్వామియే శరణం అయ్యప్ప నామ స్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమంలో గురు స్వాములు మెడికల్ నరేందర్, కోటగిరి రమేష్, అంబటి నవీన్, రవీన్ ప్రసాద్ పాల్గొన్నారు.