VIDEO: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
WGL: ఖిలా వరంగల్ రోడ్డులో బుధవారం ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించ బోయి ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో జిర్ర ప్రమీల అనే మహిళ తలకు తీవ్రగాయాలు కాగా, ఆటోలోని మరికొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108 సిబ్బంది నాగరాజు, సాంబయ్య అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.