ఇద్దరు బ్యాటరీ దొంగల అరెస్ట్

ఇద్దరు బ్యాటరీ దొంగల అరెస్ట్

NLR: సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ వాహనాల బ్యాటరీలను చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 81 వేలు విలువ చేసే 17 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. కార్పొరేషన్ ఇంజినీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, షఫీతో పాటు అప్పారావును అరెస్టు చేశామని సంతపేట సీఐ తెలిపారు.