'మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం'
సత్యసాయి: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఎన్కార్డ్ సమీక్ష సమావేశం జరిగింది. ఎస్పీ సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్న ఈ సభలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా నివారణపై చర్చించారు. యువతలో అవగాహన పెంచాలని, విద్యాసంస్థల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఆధునిక సాంకేతికతతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.