భక్తి జ్వాలల్లో ప్రకాశించిన కార్తీక పౌర్ణమి..!

భక్తి జ్వాలల్లో ప్రకాశించిన కార్తీక పౌర్ణమి..!

ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా, భజనలు, హారతులతో భక్తి వాతావరణం నెలకొంది. కార్తీక మాసం పౌర్ణమి ఈ రోజున పుణ్యకార్యాలు, దానధర్మాలు చేయడం అత్యంత శుభమని పురాణాలు చెబుతున్నాయి.