మతసామరస్యాల కోసం కృషి చేద్దాం: ఎమ్మెల్యే

మతసామరస్యాల కోసం కృషి చేద్దాం: ఎమ్మెల్యే

SRD: సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొనేలా ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సదాశివపేట పట్టణంలో ముస్లిం సోదరులకు ఇవాళ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సోదరభావం, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఉపవాస దీక్షలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలియజేశారు.