నేడు రైతులకు ఎరువుల సరఫరా కార్డుల పంపిణీ
SRPT: నేరేడుచర్ల పీఏసీఎస్లో రైతులకు ఎరువుల సరఫరా కార్డులను ఇవ్వాళ ఉ.10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పంపిణీ చేయనున్నట్లు సహకార సంఘం సీఈవో శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సహకార సంఘం పరిధిలో గ్రామాలలో వ్యవసాయ భూములున్న రైతులు ఆధార్, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, రెండు ఫొటోలతో వచ్చి తీసుకోవాలని కోరారు.