వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

KDP: సిద్ధవటం పెన్నానదిలో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన వృద్ధురాలని సిద్ధపటం పోలీసులు కాపాడారు. సోమవారం ఎక్కడి నుంచో వచ్చిన ఓ వృద్ధురాలు పెన్నానది బ్రిడ్జి పైనుంచి దూకేందుకు ప్రయత్నించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కాపాడి పరమాత్మ సేవా సంస్థలో చేర్చారు.