VIDEO: యుద్ధ ప్రభావం .. విమాన సర్వీసులకు అంతరాయం
కృష్ణా: గన్నవరంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా షార్జా విమానాశ్రయం మూసివేశారు. దీంతో గన్నవరం నుంచి 12.30కి 175 మంది ప్రయాణికులతో షార్జా బయలుదేరి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానాన్ని అధికారులు ముంబైకి తరలించారు. దీంతో ప్రయాణికులు షార్జా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రాత్రి 8.15కి విమానం తిరిగి గన్నవరం చేరుకుంది.