'సేవా దృక్పథంతో గృహ గణన చేస్తాం'
AKP: సేవా దృక్పథంతో గృహ గణన చేస్తామని ఎన్యూమరేటర్ల ప్రతిజ్ఞ చేశారు. నక్కపల్లిలో మూడు రోజులు పాటు గృహ గణనపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఇళ్లకు ఎలా వెళ్లాలి ఏ విధంగా గణన చేయాలో మాస్టర్ ట్రైనర్స్ ఎన్.వీ.ఎస్. ఆచార్యులు, ఏ.ఏసు దేవుడు అవగాహన కల్పించారు. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి గృహ గణన ప్రారంభం అవుతుందని తహసీల్దార్ చిన్ని కృష్ణ తెలిపారు.