వన దుర్గా భవాని ఆలయం వద్ద ఆకాశదీపం ఆవిష్కరణ
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలోని వన దుర్గ భవాని ఆలయం ఎదుట మంగళవారం సాయంత్రం అర్చకులు ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. కార్తీక మాసం సందర్భంగా ప్రదోషకాలంలో వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి హారతి పూజలు చేసి, ఆకాశ దీపోత్సవం వేడుక జరుపుకుని, దర్శించుకున్నారు.