ఇసుక మాఫియాలో బయటపడిన కొత్తట్రిక్
కృష్ణా: మైలవరం నియోజకవర్గం చిన నందిగామలో ఇసుక మాఫియా మట్టి నుంచి ఇసుకను వేరుచేసే కొత్త దందా ప్రారంభించింది. నదులు, చెరువుల్లో నీరు ఎక్కువగా ఉండటంతో, ఫిల్టర్ విధానంలో మట్టి నుంచి ఇసుకను వేరుచేసి వ్యాపారం చేస్తున్నారు. ఇసుక నాణ్యత ప్రశ్నార్థకమైనా, కాసుల కక్కుర్తితో ప్రజలను మోసగిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు కోరుతున్నారు.