నేటి నుంచి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

నేటి నుంచి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

CTR: వి.కోట మండలంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నేటి నుంచి వరుసగా నాలుగు రోజులు పర్యటించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. 8, 9, 10, 11వ తేదీల్లో పలు పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 8న గోనుమకూల పల్లి, కృష్ణాపురం, 9న నెర్నిపల్లి, బోడిగుట్లపల్లి, 10న కుంభార్ల పల్లె, బైరుపల్లి, 11న చింతమకూలపల్లె, బోయాచిన్నాగనపల్లె పంచాయతీల్లో పర్యటించనున్నారు.