పరిగి నియోజకవర్గంలో తొలి ఏకగ్రీవం
VKB: పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం అచన్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి చెన్నారెడ్డి శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదేవిధంగా ఆరుగురు వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవమయ్యారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని సర్పంచ్, వార్డు సభ్యులు ఈ సందర్భంగా వివరించారు.