'విద్యారంగానికి 30 శాతం నిధులు ఇవ్వాల్సిందే'
KNR: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, లేనిపక్షంలో ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలైన ఉచిత ఇంటర్నెట్, స్కూటీలు, ల్యాప్‌టాప్ల ఊసే లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు.