నగరి సీఐగా మల్లికార్జున్ రావు బాధ్యతలు
CTR: నగరి సీఐగా పనిచేస్తున్న విక్రమ్ తిరుపతి స్పెషల్ బ్రాంచు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తిరుపతి కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న మల్లికార్జున్ రావు నగరి సీఐగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. తాను ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటానని, ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు.