నాయకులు, అధికారులపై కోవూరు MLA అసహనం
NLR: నాయకులు, అధికారులు సక్రమంగా పనిచేస్తే గ్రీవెన్స్ నిర్వహించుకునే పరిస్థితి ఉండదని కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నాయకులు, అధికారుల అలసత్వంతో గ్రీవెన్స్‌లో అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. నాయకులు, అధికారుల తీరుపై MLA అసహనం వ్యక్తం చేశారు. సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలని బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సమావేశంలో ఆమె సూచించారు.