సామూహిక వరలక్ష్మి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: భక్తిభావంతో అమ్మవారిని పూజిస్తే అంతా మంచే జరుగుతుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం గునుపూడిలోని శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. 800 మంది మహిళలు సామూహిక వ్రతాలలో పాల్గొన్నారు.