బీసీసీఐ సెలెక్షన్‌ ప్యానెల్‌లోకి ప్రజ్ఞాన్‌ ఓజా!

బీసీసీఐ సెలెక్షన్‌ ప్యానెల్‌లోకి ప్రజ్ఞాన్‌ ఓజా!

బీసీసీఐ సెలెక్షన్ ప్యానెల్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజాకు స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలెక్షన్ ప్యానెల్‌లోని రెండు పదవులకు ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. సౌత్ జోన్ నుంచి శరత్ తన పదవీకాలం పూర్తి చేసుకున్నందున.. ఆ స్థానంలో ఓజా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించలేదు.