VIDEO: స్మశానానికి జంగిల్ క్లియరెన్స్

NLR: అల్లూరు మండలంలోని పురిణి కొత్తపాలెంలో ఇటీవల గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో ఊరిలో ఉన్న స్మశానములో ముళ్ళ కంప చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయని స్థానిక ప్రజలు సర్పంచ్ స్వాతి, ఉప సర్పంచ్ శ్రీనివాసులకు వినతులు ద్వారా తెలియజేశారు. ఈ విషయంపై సర్పంచ్ స్వాతి వెంటనే స్పందించారు. శనివారం జెసిబితో స్మశానానికి జంగిల్ క్లియరెన్స్ చేయించారు.