'సైబర్ నేరాల పట్ల అప్రమత్తం'

'సైబర్ నేరాల పట్ల అప్రమత్తం'

SKLM: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్ ఎస్సై సింహాచలం పేర్కొన్నారు. సోమవారం రాత్రి సబర్ పేట గ్రామంలో నారిశక్తి అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శక్తి యాప్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో మొబైల్ నుంచి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.