'గణేష్ మండపాల్లో భద్రత నియమాలు పాటించాలి'

SDPT: గణేశ్ నవరాత్రి వేడుకల సందర్భంగా మండపాల నిర్వాహకులు సరైన భద్రత నియమాలు పాటించాలని ముఖ్యంగా విద్యుత్ భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలని ఎస్సై సౌజన్య సూచించారు. మండపాలను విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర ఏర్పాటు చేయరాదని, లైసెన్స్ పొందిన ఎలక్ట్రిషియన్ ద్వారానే వైరింగ్ చేయాలని, ప్రతి మండపంలో అవసరమైన ఏమ్సిబిలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.