వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన పోలీసులు

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన పోలీసులు

ASF: జిల్లా ఎస్పీ నితిక పంత్, ఎఎస్పీ చిత్తరంజన్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం రెబ్బెన మండలంలోని గోండుగూడ గ్రామంలో 'పోలీసులు మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో వృద్ధులకు 60 దుప్పట్లు పంపిణీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించి సహకరించాలని కోరారు.