నేడు పోలీసుల 'ఏక్తా రన్'

నేడు పోలీసుల 'ఏక్తా రన్'

TG: రాష్ట్రీయ ఏక్తా దివస్(జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీసులు పీపుల్స్ ప్లాజా వద్ద 'ఏక్తా రన్' నిర్వహించనున్నారు. ఈ ఏక్తా రన్‌లో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ సహా పలువురు ఉన్నతాధికారులు సహా పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. దేశ ఐక్యత, సమగ్రత సందేశాన్ని ఈ రన్ ద్వారా చాటిచెప్తారు.