CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. చింతలపూడి మండలానికి చెందిన అబ్బదాసరి జ్యోతికి రూ.51,000, గోకవరం గ్రామానికి చెందిన బొందల వెంకటేశ్వర్లుకు రూ.20,000, మల్లంపల్లి చిట్టెమ్మకు రూ. 25,000 చెక్కులను ఆయన అందించారు.