VIDEO: చర్చిని కూల్చివేసిన దుండగులు
KMM: బోనకల్ మండలం గోవిందపురం (ఎల్) గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు జేసీబీ సహాయంతో ఒక చర్చిని, సిలువను కూల్చివేశారు. గత ఆరేళ్లుగా ఈ ప్రార్థన మందిరాన్ని నిర్వహిస్తున్నట్లు చర్చి నిర్వాహకుడు రాంబాబు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. చర్చి సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చర్చిని కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.