ఆర్టీసీ చోదకులకు డీఎస్పీ అవగాహన
VZM: జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సు డ్రైవర్లకు రహదారి ప్రమాదాలపై టౌన్ డీఎస్పీ గోవిందరావు గురువారం అవగాహన కల్పించారు. రహదారి ప్రమాదాలలో ఆర్టీసీ బస్సులు అధికంగా ఢీ కొట్టి చనిపోతున్నట్లు చెప్పారు. డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా బస్సులు నడపాలని హితవు పలికారు.