కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: మంత్రి
కోనసీమ: టీడీపీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం వేగాయమ్మపేటకి చెందిన కుడుపూడి కనకరాజు ఇటీవల అకాల మరణం చెందగా.. ఆయన కుటుంబానికి టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం మంగళవారం మంత్రి అందజేశారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు.