కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు
NRML: మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక-మానసిక ఉల్లాసం పొందుతారని ఆయన తెలిపారు. లెమన్ స్పూన్, క్యారం, చెస్ వంటి పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, తదితరులు పాల్గొన్నారు.