పంచాయతీ ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తి: కలెక్టర్
GDWL: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శాంతియుత వాతావరణంలో సజావుగా పూర్తయినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఆదివారం మల్దకల్ ప్రభుత్వ పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.