VIDEO: ముగిసిన స్వామివారి బ్రహ్మోత్సవాలు

VIDEO: ముగిసిన స్వామివారి బ్రహ్మోత్సవాలు

ప్రకాశం: రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలో గల శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగిన ఈ బ్రహ్మోత్సవాలకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఆదివారంతో విజయవంతంగా ముగిశాయి.