VIDEO: స్థల వివాదంపై ఎమ్మెల్యే పరిశీలన
KRNL: ఆదోనిలో SKD కాలనీలో ఇంటి స్థలం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బాధితురాలు ఫాతిమాపై దాడి జరిగినా పోలీసులు స్పందించలేదని ఎమ్మెల్యే పార్థసారథికి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళలపై దాడులు హేయమని పేర్కొని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.