పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది: రిటర్నింగ్ అధికారి
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో యూసఫ్‌గూడ రిటర్నింగ్ అధికారి సాయిరామ్ ఓటింగ్ సరళిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, పోలింగ్ రోజు పార్టీ నేతలు బూత్‌ల వద్దకు రావడం సాధారణమే, ఇప్పటి వరకు నియమాలను ఉల్లంఘించిన కారణంపై 3 కేసులు నమోదయ్యాయన్నారు.