విగ్రహా ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్సీ

విగ్రహా ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్సీ

NLG: తిరుమలగిరిసాగర్ మండలంలోని గరకనేట్ తండాలో నిర్వహించిన ఆలయ విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఎమ్మెల్సీని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.