VIDEO: దివ్యాంగుల ఫించన్లు వెరిఫికేషన్

PLD: ఈపూరు మండలంలో ఫించన్లు పొందుతున్న దివ్యాంగుల సదరం ధ్రువపత్రాలపై వైద్యుల బృందం గురువారం విచారణ చేపట్టింది. కొచ్చర్ల, ఉప్పరపాలెం, వనికుంట గ్రామాల్లోని దివ్యాంగుల సర్టిఫికెట్లను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో పరిశీలించారు. ఇప్పటివరకు 7 శిబిరాల్లో దాదాపు 500 మంది సర్టిఫికెట్లను తనిఖీ చేసినట్లు వైద్య బృందం వెల్లడించింది.