కాళీయమర్ధనుడిగా జగదభిరాముడు
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మొత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 8వ రోజు కాళీయమర్ధనుడి అలంకారంలో జగదభిరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారిని పట్టు వస్త్రాలు, పుష్ప మాలికలు, ఆభరణాలతో అలంకరించి, ఆలయ మాడ, పుర వీధుల్లో గ్రామోత్సవాన్ని అట్టహాసంగా జరిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల కోలాటం, చెక్క భజన ఆకట్టుకుంది.