చిత్తూరు జిల్లాలో 380కు పైగా స్క్రబ్ టైఫస్ కేసులు
చిత్తూరులో 380కు పైగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అయ్యాయి. అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ రోగులు తమిళనాడు, కర్ణాటక, ప్రవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకుంటున్నారు. గత 7 నెలలుగా జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.