VIDEO: పోలీసులకు సమాచారం ఇవ్వాలి: సీఐ
ASR: మహిళలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కొయ్యూరు సీఐ బీ. శ్రీనివాసరావు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం రాజేంద్రపాలెం వారపు సంత నుంచి గుడ్లపల్లి జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వారపు సంతకు వచ్చిన చుట్టుపక్కల గ్రామాల మహిళలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మహిళల భద్రత గురించి అవగాహన కల్పించారు.