నేటి నుంచే ఒంటి పూట బడులు
SDPT: వేసవికాలం దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని 980 ప్రభుత్వ, 250 ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 1.3 లక్షల మంది విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ ఒంటిపూట తరగతులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగుతాయి.