గన్నవరంలో పశువుల దాణా పంపిణీ

కృష్ణా: గన్నవరంలో పాడి రైతులకు పశువుల దాణా పంపిణీ కార్యక్రమం మంగళవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని పాడి రైతులకు దాణా కట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాడి రైతులకు ప్రభుత్వం సగం ధరకే పశువుల దాణా పంపిణీ చేస్తుందన్నారు.