అన్నారుగూడెం ఎస్సీ కాలనీని పరిశీలించిన MRO

KMM: తల్లాడ మండలం అన్నారుగూడెంలో గత రాత్రి కురిసిన వర్షాలకు ఎస్సీ కాలనీ రోడ్లు, పలు ఇళ్లు నీట మునగగా ఈరోజు తహసీల్దార్ సురేష్ కుమార్ వరద ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు అనేక సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందిస్తూ శాశ్వతంగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని తెలిపారు.