కిన్నెరసాని ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల కారణంగా పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు, కాగా ప్రస్తుతం 396.70 అడుగులకు చేరుకుంది. బుధవారం ఉదయం 8:30కు 3,400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అవుట్ ప్లో లేదన్నారు.