VIDEO: విశాఖలో ఎండ ప్రచండం

VIDEO: విశాఖలో ఎండ ప్రచండం

VSP: విశాఖపట్నంలో ఆదివారం ఎండ తీవ్ర రూపం దాల్చింది. ఉదయం నుంచే భానుడు భగభగమంటూ ప్రతాపం చూపించడంతో నగరంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. తీవ్రమైన ఎండ వేడికి తోడు ఉక్కపోత కూడా తోడవడంతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎండ తీవ్రత నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.