బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
ప్రకాశం: రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలో గల శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు, మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు.