కట్నం తీసుకున్న ఇచ్చిన నేరమే
ప్రకాశం: కట్నం తీసుకున్న ఇచ్చిన నేరమేనని కనిగిరి మున్సిపాలిటీ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. వరకట్న వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం కనిగిరి మండల న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో స్థానిక వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాల నందు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ.. వరకట్నం నిషేధ చట్టం 1961పై అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.